చంద్రబాబుపై ‘యాత్ర’ ఎఫెక్ట్ గట్టిగానే.. !

దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’ ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. వైఎస్ఆర్ పాద’యాత్ర’ని చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఎమోషన్ కి గురవుతున్నారు. దర్శకుడు మహి.వి రాఘవ్ కథని అంత గ్రిప్పింగ్ గా నడిపాడు. ప్రియతమ నేతని తెరపై చూసుకొని సంబరపడిపోతున్నారు వైఎస్ అభిమానులు. వైఎస్ కి సంబంధించిన పొలిటికల్ సిచువేషన్స్, కాంగ్రెస్ పాలన లోపాలను, వైఎస్ పార్టీలో ఎలా గుర్తింపు తెచ్చుకొని జనాల్లో హీరో అయ్యారు అనే సన్నివేశాలు ఆకట్టుకొనేలా ఉన్నాయి.

అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎన్నికల ప్రచార అస్త్రంగా ‘యాత్ర’ని మలిచినట్టు కనబడుతోంది. వైఎస్ఆర్ పాద’యాత్ర’లో టీడీపీ అధినేత, ఏపీ సీఎంపై సటైర్స్ గట్టిగానే పడ్డాయి. వాటిని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు.. ‘ఓటుకి నోటు’ కేసులో ఆడియో టేపుని కూడా వాడుకొన్నారు. ఇవన్నీ వైసీపీ శ్రేణులని, జగన్ అభిమానులని తెగ ఆకట్టుకొంటున్నాయి. యాత్రలో చాలా తెలివిగా చంద్రబాబుని కార్నర్ చేసినట్టు కనబడుతోంది. మొత్తంగా.. సీఎం చంద్రబాబుపై యాత్ర ఎఫెక్ట్ గట్టిగానే పడేటట్టు కనబడుతోంది.

దీనికి కౌంటర్ గా వైఎస్ఆర్, వైఎస్ జగన్ పై సటైర్స్ వేయడానికి ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ఏమైనా వాడుకోనున్నారా.. ? దీనికి సంబంధించి టీడీపీ వర్గాలు, బాలయ్య సడెన్ సప్రైజ్ ఏమైనా ఇస్తారా.. ?? అన్నది తెలియాల్సిందే. అలాంటిదేమీ.. లేకుంటే మాత్రం పొలిటికల్ మైలైజీ విషయంలో ఎన్టీఆర్ బయోపిక్ కంటే.. వైఎస్ఆర్ బయోపిక్ కు ఎక్కువ మార్కులు పడినట్టే.