మహేష్’తో అనిల్ ‘దూకుడు 2’ ?

ఫ్లాపులేని దర్శకుడు అనిల్ రాఘవపూడి. ఆయన చేసిన పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సంక్రాంత్రి సినిమా ‘ఎఫ్ 2’ లాభాల్లో ఇండస్ట్రీ రికార్డులని తిరగరాస్తోంది. ఈ ఆనందంలో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకొంటున్న తెలుస్తోంది. ఐతే, ఇప్పుడీ సినిమా గురించి ఓ ఆసక్తిర విషయం బయటికొచ్చింది. అనిల్ సినిమా మహేష్ సొంత బ్యానర్ లో అనుకొన్నారంట. ఇప్పుడీ ప్రాజెక్టులో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ అధినేతల్లో ఒకరైన అనిల్ సుంకర్ భాగస్వామి అయినట్టు సమాచారమ్.

మహేష్ తో 14 రీల్స్ సంస్థ నిర్మించిన ‘దూకుడు’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి రచయితగా పనిచేశారు. ఈ నేపథ్యంలో మహేష్ తో దూకుడు సీక్వెల్ ప్లాన్ చేద్దామనే ఆలోచనలో అనిల్ సుంకర, అనిల్ రావిపూడి ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. మహేష్ మరోసారి దూకుడు చూపించడం ఖాయం. ప్రస్తుతం మహేష్ మహర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మహేష్ సినిమా ఉండనుంది. ఈ రెండు సినిమాల తర్వాత దూకుడు సీక్వెల్ ఉండొచ్చని చెబుతున్నారు.