రాసిపెట్టుకోండీ.. బన్నీ కూతురిది ప్రేమ వివాహమే.. !


ఇప్పుడే చెబుతున్నాం రాసిపెట్టుకోండి.. స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ ప్రేమ వివాహం చేసుకుంటుంది. ఈ విషయంలో అర్హకి ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసినట్టుంది. ఈ మేరకు తండ్రి బన్నీకి కూడా స్పష్టనిచ్చింది. అసలు విషయమేమిటంటే.. తాజాగా, కూతురు అర్హతతో సరదాగా ఆడుకొంటున్న ఓ వీడియోని బన్నీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఇందులో తన కూతురుతో ‘నేను నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటా’నని అనిపించే ప్రయత్నం చేస్తున్నాడు. అర్హ మాత్రం దేశముదురు. ‘నేను నాన్న చెప్పిన అబ్బాయిని.. చేసుకోను’ అంటూ సమాధానం ఇచ్చింది. ఇలా చాలాసార్లు అదే సమాధానం చెప్పింది. దీంతో బన్నీ నవ్వుల్లో మునిగిపోయాడు. ఈ వీడియో చూసినోళ్లు.. బన్నీయే కాదు.. ఆయన కూతురు దేశముదురే అని కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు.. రాసిపెట్టుకోండీ.. తండ్రి మాదిరిగా బన్నీ కూతురు అర్హ కూడా ప్రేమ పెళ్లియే చేసుకొంటుందని కామెంట్స్ చేస్తున్నారు. బన్నీది ప్రేమ వివాహమే అయినా..పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకొన్నాడు. అర్హ కూడా అదే చేస్తుందేమో.. !