‘ఆర్ఆర్ఆర్’లో అజయ్ దేవగణ్ ?


ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి మల్టీస్టారర్ #RRR తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు, సినిమాకు సంబంధించి రోజుకో కొత్త విషయం తెరపైకి వస్తోంది. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. రామ్ చరణ్ జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ జతకట్టనుంది. ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ హీరోయిన్ ని ట్రై చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

తాజాగా, ‘ఆర్ఆర్ఆర్’ గురించి కొత్త విషయం బటికొచ్చింది. ఇందులో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు చెబుతున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమాను హిందీలో ‘మక్కీ’ పేరుతో డబ్ చేశారు. ఈ సినిమాకు అజయ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. అప్పటి నుంచి రాజమౌళి, అజయ్‌ మంచి స్నేహితులయ్యారు. అందుకే సినిమాలో అజయ్‌కు అవకాశం ఇచ్చినట్లు తెలిసింది.