క్రిష్ పై కసి, బాలయ్యపై జాలి !


బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ టైం చూసి కొడుతోంది. ‘మణికర్ణిక’ సినిమా విషయంలో క్రిష్-కంగనాల మధ్య జరిగిన గొడవ సంగతి తెలిసిందే. డైరెక్షన్ క్రెడిట్ మొత్తం కంగనా తన ఖాతాలో వేసుకోవడంపై క్రిష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇరువురు కూడా ఒకరిపై మరొకరు ఓ రేంజ్ లో ఆరోపణలు చేసుకొన్నారు. అవి మీడియాలో హైలైట్ గా నిలిచాయ్. కొన్నాళ్ల క్రిందటే ఈ వివాదానికి తెరపడింది. ఐతే, ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ అట్టర్ ప్లాప్ కావడంతో.. కంగనా ఛాన్స్ దొరికినట్టయింది.

ఎన్టీఆర్ బయోపిక్ ప్లాప్ పై స్పందించాల్సిందిగా బాలీవుడ్ మీడియా కంగనాని అడగగా.. తనదైన శైలిలో రెచ్చిపోయింది. ‘బాలయ్య సర్ ని చూస్తే బాధగా ఉంది. ఆయన కెరీర్ లో ఎన్టీఆర్ బయోపిక్ ఓ మచ్చలా నిలిచిపోయింది. తన జీవితాన్ని పనంగా పెట్టి బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ ని క్రిష్ చేతిలో పెట్టారు. ఆయన తన డైరెక్షన్ ఫెల్యూర్ తో సినిమాని ప్లాప్ చేశారు’ అంది కంగనా.

అక్కడితో ఆగకుండా ‘మణికర్ణిక’ వివాదాన్ని మరోసారి గెలికింది. ‘మణికర్ణిక’ నిర్మాణ పరంగా సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నందుకు నాపై కొందరు మానసికంగా దాడి చేశారు. క్రిష్‌తో పాటు పెయిడ్ మీడియా దుష్ప్రచారానికి దిగాయి. నిజాయితీగా చెప్పొచ్చేదేమంటే… ఇలాంటి కృతఘ్నుల కోసమా స్వాతంత్య్ర సమరయోధులు రక్తం చిందించారన్న విషయమే నన్ను బాధపెడుతోంది’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.