సర్జికల్ స్ట్రైక్ 2 సక్సెస్ ఫుల్
పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకొంది. భారత వైమానిక దళం.. ఎల్ఓసీ దాటి మెరుపు దాడులు చేపట్టింది. మెరుపు దాడులు చేపట్టి ఉగ్రస్థావరాలను భారత వైమానిక దళం ధ్వంసం చేసింది. 12 మిరేజ్ 2000 ఫైటర్ జెట్లతో సుమారు వెయ్యి కిలోల బాంబులను జైషే మహ్మద్ తీవ్రవాద స్థావరాలపై వేసింది. ఈ దాడుల్లో సుమారు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారని అంచనా వేస్తున్నారు. భారత వైమానిక దళం చేసిన మెరుపుదాడులపై ప్రపంచదేశాలు సైతం హర్షం వ్యక్తం చేస్తోంది.
రాజకీయాలని పక్కన పెట్టి ప్రతి ఒక్కరు భారత వైమానిక దళం ధైర్య సాహాసాలని ప్రశంసిస్తున్నారు. రాజకీయ, సినీ, క్రీడా రంగాలకి చెందిన ప్రముఖులు, దేశ ప్రజలు భారత వైమానిక దళాన్ని మెచ్చుకొంటున్నారు. మరోవైపు, మెరుపుదాడుల తర్వాత ప్రధాని మోదీ సమీక్ష నిర్వహిస్తున్నారు. హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తదితర ముఖ్యులతో సమావేశం అయ్యారు.