దెబ్బకొట్టాం.. ! తిప్పికొట్టాం.. !!
దెబ్బకొట్టాం అంటోంది భారత్. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకొన్నాం. ఎల్ఓసీని దాటి భారత వాయుసేన పాక్ ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో 200 నుంచి 300మంది ఉగ్రవాదులు హతం అయినట్టు భారత్ అంచనా వేస్తోంది. భారత వైమానిక దళం మెరుపు దాడి చేసినట్లు భారత్ ధ్రువీకరించింది. ఈ మేరకు దాడి వివరాలని భారత విదేశాంగశాఖ కార్యదర్శి విజయ్ గోఖలే మీడియాకు వివరించారు.
మరోవైపు, పాక్ మాత్రం భారత వాయుసేన చేసిన దాడిని సమర్థవంగా తిప్పికొట్టాం అంటోంది. పాక్ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన భారత యుద్ధ విమానాలను తాము సమర్థంగా తిప్పికొట్టామని ఆ దేశ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ అసిఫ్ గఫూర్ తెలిపారు. తమ వైపు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. అదేసమయంలో భారత్ దాడిపై పాక్ ప్రభుత్వం అత్యవసర సమావేశం నిర్వహించింది. అదేసమయంలో చైనాతో పాకిస్థాన్ ప్రతినిధులు చర్చలు కూడా జరుపుతున్నట్టు తెలుస్తోంది.
మొత్తంగా.. దెబ్బతిన్న పాకిస్థాన్ గంభీరాన్ని ప్రదర్శిస్తోంది. నొప్పి తెలియకుండా ప్రవర్తిస్తూనే చైనాతో కలిసి కుట్రలు పన్నుతోంది. చైనా సహరిస్తే.. భారత్ పై యుద్ధానికి దిగేందుకు రెడీ అవుతోంది. ఐతే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాక్ కి మరో దేశం సహకరించే సాహాసం చేయకపోవచ్చు. ఇక, పుల్వామా ఉగ్రదాడిపై ప్రతికారం తీర్చుకొన్న భారత్.. పాక్ పై మరిన్ని దాడులు చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారమ్.