‘సర్జికల్ స్ట్రైక్ 2’పై సినీ ప్రముఖుల హర్షం
వేట మొదలైంది.వాయుసేన పోటు దించేసింది.పుల్వామా ఉగ్రదాడిపై భారత్ ప్రతికారం తీర్చుకొంది. మంగళవారం తెల్లవారుజామున భారత వైమానిక మెరుపు దాడులు చేపట్టింది. పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 200 నుంచి 300మంది ఉగ్రవాదులు హతమైనట్టు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు భారత్ చేపట్టిన మెరుపుదాడులపై హర్షం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
* ‘బుల్లెట్ దిగిందా లేదా..’- పూరీ జగన్నాథ్
* ‘దేశం సరైన సమాధానం చెప్పింది’- తారక్
* ‘భారత వైమానిక దళాన్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది’- రామ్‌చరణ్
* ‘భారత వైమానిక దళానికి సెల్యూట్. జై హో. జై హింద్’- నితిన్
* ‘సెల్యూట్ ఐఏఎఫ్. మన దేశానికి ఎంతో గర్వకారమైన రోజిది’- అఖిల్
* ‘ఎవడు కొడితే ఉగ్ర శిబిరాలన్నీ బ్లాక్ అయిపోతాయో వాళ్లే మన సైనికులు’- బ్రహ్మాజీ
* ‘మేం సమాధానం ఇస్తే సమాధులు కట్టుకోడానికి మీకు శవాలు కూడా దొరకవు’- కోన వెంకట్
* ‘చేతులు ముడుచుకుని కూర్చునే టైం కాదని ప్రపంచానికి మనం నిరూపించాం. భారత వైమానిక దళానికి హృదయపూర్వక శుభాకాంక్షలు’- కల్యాణ్‌రామ్
* ‘భారత వైమానిక దళానికి మేం శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం’- అభిషేక్ బచ్చన్
* ‘జై హింద్. ఈ మెరుపు దాడుల వార్త నిజమేనని ఆశిస్తున్నా’- మంచు విష్ణు
* ‘ధైర్యం చేసి శత్రువుల గుండెల్లోకి నేరుగా గురిచూసి కొట్టిన డేర్‌డెవిల్ ఐఏఎఫ్ పైలట్లకు సెల్యూట్’- మధుర్ భండార్కర్
* ‘భారత వైమానిక దళాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది’- ఉపాసన
* ‘జైషే పరిస్థితి ఎలా ఉంది?.. ‘నాశనమైపోయింది’- రష్మి
* ‘ఉగ్ర శిబిరాలను అంతమొందిస్తున్న మన భారత వైమానిక దళాం పట్ల గర్వంగా ఉంది’- అక్షయ్ కుమార్
* ‘మాతో పెట్టుకుంటే ఇలాగే చచ్చిపోతారు. సెల్యూట్’- అజయ్ దేవగణ్
* ‘మంచి వార్తతో శుభోదయమైంది. ఆర్మీకి, ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. జైహో’- పరేశ్ రావల్
* ‘ప్రధానికి సెల్యూట్ చేయడం మొదలుపెట్టడానికి ఇదే మంచి రోజు’- అనుపమ్ ఖేర్