పొలిటికల్ ఆఫర్ : ఫ్రీగా బయోపిక్స్ టికెట్స్ !

ఎన్నికల అస్త్రం అవుతుందనుకొంటే అట్టర్ ప్లాప్ అయింది ఎన్టీఆర్ బయోపిక్. తొలిభాగం ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ బిగ్గెస్ట్ ప్లాప్ గా మిగిలింది. దాన్ని మించిన ప్లాప్ గా ‘ఎన్టీఆర్-మహానాయకుడు’ నిలిచింది. వైఎస్ఆర్ బయోపిక్ గా వచ్చిన ‘యాత్ర’ పరిస్థితి కాస్త మెరుగు. ఈ సినిమా మంచి టాక్ అందుకొంది. మొదట్లో మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఐతే, లాంగ్ రన్ లో చతికిల పడింది.

ఇప్పుడీ పొలిటికల్ బయోపిక్ లని చూసేవారు కరువురయ్యారు. ఈ నేపథ్యంలోనే పొలిటికల్ పార్టీలు ఫ్రీ ఆఫర్ పెట్టేశాయి. ఈ రెండు సినిమాలను వైకాపా, టీడీపీలు ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకొని నడిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా నరసరావు పేటలో ఈ రెండు సినిమాలని ఫ్రీగా ప్రదర్శించేందుకు రెడీ అవుతున్నారు. టీడీపీ, వైసీపీ పార్టీ కార్యాలయాల్లో సినిమా టికెట్స్ ని ఉచితంగా పంచిపెడుతున్నాయి. రండి ఉచితంగా పంచుతున్నట్టు సమాచారమ్. మొత్తంగా.. పొలిటికల్ బయోపిక్స్ ఫ్రీగా చూసే అవకాశం దక్కింది.