మన ‘వింగ్‌ కమాండర్‌’ని ఎలా చితకబాధారో చూడండి !

భారత్‌కు చెందిన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ ని అదుపులోనికి తీసుకొన్నట్టు పాకిస్థాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి సంధించిన వీడియా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మిగ్‌ -21 బైసన్‌ విమానం కూలిపోయే సమయంలో అభినందన్ సురక్షితంగా బయటపడ్డారు. కానీ పాక్‌ అక్రమిత కశ్మీర్‌లోని ఓ నదీ పరీవాహక ప్రాంతంలో ఆయన నేలపైకి దిగినట్లు తెలుస్తోంది.

అప్పటికే విమానం కూలిపోవడం గమనించిన సైనికులు, కొందరు స్థానికులు అక్కడకు చేరుకున్నారు. అప్పటి వరకు ఆయన ఒంటిమీద ఎలాంటి గాయాలూ లేవు. కానీ కొద్దిసేపటికే ఒక సైనిక స్థావరంలో ఆయన చేతులు వెనక్కి కట్టేసి తీసిన వీడియోలో మాత్రం ఆయన కంటి వద్ద గాయాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీంతో ఆయనపై దాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. ఆయనను స్థానికులు పట్టుకున్నప్పుడు కొందరు వ్యక్తులు దాడి చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.