గుడ్ న్యూస్ : రేపే అభినందన్ విడుదల

భారత వైమానిక దళ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ పాకిస్థాన్‌ నిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన్ని విడుదల చేసేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపటింది. అంతర్జాతీయంగా పాక్ పై ఒత్తిడి తీసుకొచ్చింది. ఇప్పుడీ ప్రయత్నాలు ఫలించాయి. వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ విడుదల చేసేందుకు పాక్ అంగీకరించింది. అభినందన్‌ తాము శుక్రవారం విడుదల చేస్తామని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ప్రకటించారు. ఈ మేరక్ పాక్ పార్లమెంట్ ప్రకటన చేశారు.

భారత్‌ చేపట్టిన వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు పాక్‌ బుధవారం విఫలయత్నం చేసింది. ఈ పరిణామం రెండు అణ్వస్త్ర దేశాల నడుమ వైమానిక ఘర్షణకు దారితీసింది. అప్రమత్తంగా ఉన్న భారత బలగాలు పాక్‌ దుస్సాహసాన్ని తిప్పికొట్టాయి. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధవిమానాన్ని కూల్చేశాయి. అదే సమయంలో మన దేశానికి చెందిన మిగ్‌-21 లోహ విహంగాన్ని పాక్‌ బలగాలు నేలకూల్చాయి. మిగ్‌21బైసన్‌ విమానం పైలట్‌ అభినందన్ పాక్‌కు బందిగా చిక్కాడు.