సంఝౌతా ఎక్స్ప్రెస్ రద్దు
పాకిస్థాన్ విషయంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకొంది. భారత్, పాక్ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ప్రెస్ను రద్దు చేస్తున్నట్లు భారత రైల్వేశాఖ ప్రకటించింది. సంఝౌతా ఎక్స్ప్రెస్ వారంలో రెండు రోజులు (బుధ, ఆదివారాలు) ఢిల్లీ నుంచి బయలుదేరుతుంది. అటారీలో ప్రయాణికులు దిగి వాఘాలో ఇదే పేరుతో నడిపే రైలులోకి మారాల్సి ఉంటుంది. ఇప్పుడీ రైలుని మార్చి 3 నుంచి రద్దు చేస్తున్నట్టు భారత రైల్వేశాఖ ప్రకటన చేసింది. మరోవైపు, సంఝౌతా సేవలను ఇప్పటికే పాక్ నిలిపివేసింది. దీంతో పాక్ నుంచి అటారికి రావాల్సిన ప్రయాణికులు లాహోర్ రైల్వేస్టేషన్లోనే నిలిచిపోయారు. వాళ్లని వేరే మార్గాల ద్వారా అటారి సరిహద్దుకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.