టీఆర్ఎస్’లో అసద్ పెత్తనం !
టీఆర్ఎస్ లో చేరాలంటే ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ లేదంటే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లతో చర్చలు జరిపితే సరిపోతుంది. వీరిద్దరు బిజీగా ఉన్నట్టయితే.. పార్టీలోని కీలక నేతలతో సంప్రదింపులు జరుగుతుంటాయి. ఐతే, తెరాసలో చేరేందుకు రెడీ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితారెడ్డి తన తనయుడైన కార్తీక్‌రెడ్డితో కలిసి ఆదివారం మజ్లిస్‌పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చర్చలు జరపడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే. అసద్ తో చర్చల అనంతరం వీరు కేటీఆర్, కవితలతోనూ చర్చించారనుకోండి. ఐతే, అసద్ తో భేటీలోనే సబితకు అన్ని విషయాల్లోనూ క్లారిటీ వచ్చేసినట్టు సమాచారమ్.
ఎంఐఎం తెరాస ప్రభుత్వంలో చేరలేదు. ఈ రెండు దోస్తానా పార్టీలు మాత్రమే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఎంఐఎం తెరాసకి వెన్నుదన్నుగా ఉంటుంది. ఓ సమయంలో తెరాస ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరిగినప్పుడు.. ఎంఐఎం ఆదుకొంది. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో స్వయంగా సీఎం కేసీఆర్ నే తెలిపారు. దీంతో సహజంగానే ఎంఐఎంపై తెరాసకి గట్టి నమ్మకం ఉంటుంది. ఐతే, అది తెరాస పార్టీలోకి వచ్చే నేతలతో ముందుగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చర్చలు జరపడం అంత ఉంటుందని ఎవరు ఊహించి ఉండదు. ఈ నేపథ్యంలో తెరాస-ఎంఐఎం రెండు పార్టీలు కాదు. ఒకటే పార్టీ అనుకోవచ్చేమో !