సాయం చేశాడు.. రాత్రికి రమ్మన్నాడు !
#మీటూ ఉద్యమం ఊపందుకొన్నా.. సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకి పులిస్టాప్ పడటం లేదు. తాజాగా, మరో నటి లైంగిక వేధింపులకి గురైంది. నటి విజయలక్ష్మీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆసుపత్రిలో చేరితే లక్షలు ఖర్చయ్యాయి. ఐతే, ఈ మొత్తాన్ని నటుడు రవిప్రకాష్ చెల్లించాడు. విజయలక్ష్మీని ఆదుకోవడానికి స్వతహా ముందుకొచ్చాడు. మంచి మనసుని చాటుకొన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఐతే, దీని వెనక దురుద్ధేశం దాగివుందని ఆ తర్వాత అర్థమైంది.
సాయం పేరుతో విజయలక్ష్మీని లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడట. ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడట. ఆమె కోసం రోజు ఆస్పత్రికి రావడం, ఫోన్లో అసభ్యంగా సందేశాలు పంపేవాడట. ఈ విషయాన్ని విజయలక్ష్మీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్
చేసింది. దీంతో సాయం వెనక దాగివున్న రవి ప్రకాష్ దురుద్ధేశం బయటపడింది. ఇప్పుడు రవిప్రకాష్ నీచ బుద్ధిని అందరు ఏకీపారేస్తున్నారు.