ఈ వారమే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రీమియర్ షో
రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఐతే, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సెన్సార్, విడుదలకి చిక్కులు తప్పకపోవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నారు. కొందరు ఈ సినిమా విడుదలని అడ్డుకోవాలని ఎన్నికల కమీషన్ కు లేఖలు రాసున్నారు. ఆ లేఖలని సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేస్తున్నారు.
మరోవైపు, వర్మ కొత్త స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. సినిమా విడుదలకి వారం ముందే ప్రీమియర్ షోకు ప్లాన్ చేశారు. ఈ వారమే లక్ష్మీస్ ఎన్ టీఆర్ ని ఇండస్ట్రీ ప్రముఖులకి చూపించబోతున్నారు. అంతేకాదు.. సెన్సార్ చిక్కులని ఎదుర్కొనేందుకు వర్మ న్యాయ సలహాలు తీసుకొంటున్నారంట.
గతంలో తెలుగుదేశం పార్టీలో జరిగిన సంఘటనల చరిత్రను మాత్రమే తాను తీసాను. ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విషయాలు ఓటర్లను ప్రభావితం చేసే విషయాలు తాను సినిమాలో చూపించడం లేదన్నది వర్మ వాదన. ఒకవేళ సినిమా విడుదల సాధ్యం కాకపోతే.. స్వయంగా వర్మనే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని సోషల్ మీడియాలో లీక్ చేసే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.