విశాఖ ఎంపీ అభ్యర్థిగా గంటా

విశాఖ ఎంపీ స్థానంపై సస్పెన్స్ కొనసాగుతోంది. విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని మంత్రి గంటా శ్రీనివాస్ పై టీడీపీ అధిష్టానం ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారమ్. ఐతే, అందుకు గంటా ఆసక్తి చూపడం లేదు. అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనలోనే గంటా ఉన్నారు. భీమిలీ, అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాలపై గంటా ఆసక్తి చూపుతున్నారు. అధిష్టానం మాత్రం ఆయన్ని విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఒత్తిడి తెస్తోంది.

ఈ నేపథ్యంలో గంటా అధిష్టానం ఒత్తిడికి తలొగ్గుతారా.. ? లేదంటే గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్టుగా ఆయన టీడీపీని వీడుతారా.. ?? అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ గంటా టీడీపీని వీడితే వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకి ముందు పార్టీ మారడం గంటాకి అలవాటు. ఆ అలవాటునే ఈసారి కొనసాగిస్తారా.. ? అన్నది ఒకట్రెండు రోజుల్లో తేలనుంది.