సామ్ గుండెల్లో చై.. పాట వింటారా.. ?


సమంత-నాగచైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ దర్శకుడు. ఏప్రిల్ 5న ‘మజిలీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ ని మొదలెట్టింది చిత్రబృందం. రెండు లిరికల్ సాంగ్స్ ని వదిలారు. తాజాగా, మూడో లిరికల్ సాంగ్ ‘నా గుండెల్లో’ సాంగ్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు (మార్చి 14) సాయత్రం 6:30నిమిషాలకి
#NaGundello లిరికల్ వీడియోని విడుదల చేయబోతున్నట్టు సామ్ ట్విట్ చేశారు.

పెళ్లి తర్వాత సామ్-చై కలిసి నటిస్తున్న తొలి చిత్రమిది. దీంతో మజిలీ కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదల టీజర్ కు మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగిపోతుంది.
రూ. 15కోట్లకి థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయినట్టు సమాచారమ్. ఈ చిత్రానికి గోపీసుందర్‌ సంగీతం అందిస్తున్నారు.