కాంగ్రెస్ తర్వాతే టీఆర్ఎస్ !
ప్రత్యర్థి బలం తెలుసుకొని బరిలోకి దిగాలని చెబుతుంటారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే ఫాలో అవుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలైన తర్వాతే తెరాస అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయానికి సీఎం కేసీఆర్ వచ్చినట్టు సమాచారమ్. ఈ నెల 15న కాంగ్రెస్ జాబితా విడులయ్యే వీలుంది. దీనిని పరిగణనలోకి తీసుకొని 16న తెరాస అభ్యర్థులని ప్రకటించాలని నిర్ణయించారు.
ఒకవేళ 15న కాంగ్రెస్ అభ్యర్థులని ప్రకటించనట్లయితే.. తొలి విడతగా ఆరుగురు తెరాస అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు. కాంగ్రెస్ జాబితా వచ్చాక మిగిలిన 10 మంది పేర్లను వెల్లడించబోతున్నారని సమాచారమ్. ఈ నెల 15, 16 తేదీల్లో కేసీఆర్ ఎంపీలకు, ఎంపీ అభ్యర్థులకు విందునివ్వనున్నారు. ఎంపికైన వారితో, ఎంపికకాని వారితో విడివిడిగా సమావేశం నిర్వహించనున్నారు. టికెట్లు దక్కని వారితో మాట్లాడి వారు అసంతృప్తికి గురికాకుండా వారికి కల్పించనున్న అవకాశాలను తెలియజేస్తారని తెలిసింది.