#RRR వందేళ్ల కథ !

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విశేషాలని రాజమౌళి మీడియాకు వివరించారు. ఇది ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ ల కథ. 1897లో ఆంధ్రలో అల్లూరి సీతారామరాజు పుట్టారు. 1901లో ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్‌లో కొమురం భీం పుట్టారు. వీరిద్దరి కథల్లోని ఓ కామన్ పాయింట్ ఆధారంగా ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కుతోందని జక్కన్న తెలిపారు.

అల్లూరి, కొమరం భీం యుక్తవయసులో ఉన్నప్పటి కథని రాజమౌళి చూపించబోతున్నాడు. ఆ లెక్కన ఇది 1920 ప్రాంతంలో జరిగిన కథ. సరిగ్గా వందేళ్లకు అంటే.. 2020లో వీరికథని ప్రేక్షకుల ముందుకు చూపించబోతున్నాడు జక్కన్న. ఇదే విషయాన్ని ఓ మీడియా ప్రతినిధి రాజమౌళి అడిగారు. 1920లో జరిగిన కథని మీరు 2020లో చూపించబోతున్నారు. వందేళ్ల కథని తెరకెక్కిస్తున్నారని అన్నారు. దీనికి రాజమౌళి అవును అన్నారు. ఆ విషయం నాకు స్ట్రయిక్ కాలేదని నవ్వేశారు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ కోమరంభీం పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. చరణ్ కి జంటగా అలియాభత్ జతకట్టనుంది. ఎన్టీఆర్ జంటగా డైసీ అడ్గార్జియోన్స్‌ నటిస్తున్నారు. తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని, బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ను 2020 జూన్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.