అందుకే తారక్, చరణ్’లని తీసుకొన్నాడట !


‘బాహుబలి’ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఈ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా చేసేందుకు బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ ఆసక్తిని చూపించి ఉంటారు. ఐతే, రాజమౌళి మాత్రం మళ్లీ టాలీవుడ్ స్టార్స్ తో సినిమా ప్లాన్ చేసుకొన్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా #RRR మల్టీస్టారర్ తీసుకొస్తున్నారు. దీనిపై గురువారం రాజమౌళి నిర్వహించిన ప్రెస్ మీట్ లో రాజమౌళికి ప్రశ్న ఎదురైంది. దీనికి జక్కన్న ఆసక్తికర సమాధానం చెప్పారు.

తెలుగు హీరోల జీవితకథతో తీస్తున్న సినిమా కోసం తెలుగు హీరోలని తీసుకోవడమే బాగుంటుందని అనిపించింది. అయినా.. కథ బలంగా ఉంటే సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులని మెప్పిస్తుంది. బాహుబలితో అది రుజువైంది కూడా అన్నారు. #RRR కోసం ఎన్టీఆర్, చరణ్ లని తీసుకొన్నారు. ఇందులో తారక్ కొమరంభీమ్ పాత్రలో, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తారని తెలిపారు. ఈ మల్టీస్టారర్ కు ‘ఆర్ఆర్ఆర్’ అనే టైటిల్ ఉంటూనే.. వివిధ బాషల్లో టైటిల్స్ పెడతామని తెలిపారు.