తెలుగుదేశం తొలి జాబితా వచ్చేసింది

తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తొలి జాబితా వచ్చేసింది. 126మందితో కూడిన అసెంబ్లీ అభ్యర్థులతో టీడీపీ తొలి జాబితాని విడుదల చేశారు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ లిస్టులో నలుగురు సిట్టింగులకి టికెట్స్ దక్కలేదు. 10మంది వారసులకి అవకాశం ఇచ్చారు. మొత్తంగా తొలి జాబితాలో 71మంది ఓసీ, 31బీసీ, 15 ఎస్సీ, 4 ఎస్టీ, 2 మైనార్టీ అభ్యర్థులకి టికెట్లు దక్కాయి.

ఈ సారి 150మంది స్థానాల్లో గెలుస్తామని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్లు కష్టపడి పనిచేశాం. అభివృద్ధి చేశాం. ఇన్నాళ్లు పడిన కష్టానికి కూళీ అడుగుతున్నా. మరోసారి గెలిపిస్తే గతంలో కంటే వందరెట్లు కష్టపడతా. అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక, తొలి జాబితాలో కొందరి సిట్టింగుల స్థానాలు మారాయి. తొలి జాబితాలో కేవలం అసెంబ్లీ స్థానాలపైనే దృష్టి సారించారు. లోక్ సభ అభ్యర్థులని ప్రకటించలేదు.

జిల్లాలవారీగా టీడీపీ తొలిజాబితాలో టికెట్ దక్కించుకొన్న అభ్యర్థుల పూర్తి వివరాలు :

శ్రీకాకుళం : మొత్తం : 10, ఖరారు : 9, పెండింగ్‌ : 1

ఇచ్చాపురం: బెందాళం అశోక్‌

పలాస: గౌతు శిరీష

టెక్కలి: కింజరాపు అచ్చెన్నాయుడు

నరసన్నపేట: బగ్గు రమణమూర్తి

ఆముదాలవలస: కూన రవికుమార్‌

శ్రీకాకుళం: గుండ లక్ష్మీదేవి

రాజాం: కోండ్రు మురళీ మోహన్‌

ఎచ్చెర్ల: కిమిడి కళా వెంకట్రావు

పాతపట్నం: కలమట వెంకటరమణ

పెండింగ్‌ : పాలకొండ

విజయనగరం – మొత్తం : 9, ఖరారు: 7, పెండింగ్‌ : 2

బొబ్బిలి : సుజయ్‌కృష్ణ రంగారావు

ఎస్‌.కోట : కోళ్ల లలిత కుమారి

సాలూరు : ఆర్‌.పి.భంజ్‌దేవ్‌

పార్వతీపురం : బొబ్బిలి చిరంజీవులు

కురుపాం : జనార్దన్‌ థాట్రాజ్‌

గజపతినగరం : కొండపల్లి అప్పలనాయుడు

చీపురుపల్లి : కిమిడి నాగార్జున

పెండింగ్‌ : నెల్లిమర్ల, విజయనగరం

విశాఖపట్నం – మొత్తం : 15, ఖరారు : 10, పెండింగ్‌ : 5

విశాఖపట్నం తూర్పు : వెలగపూడి రామకృష్ణబాబు

విశాఖపట్నం దక్షిణం : వాసుపల్లి గణేశ్‌కుమార్‌

విశాఖపట్నం పశ్చిమం: పీజీవీఆర్‌ నాయుడు (గణబాబు)

యలమంచిలి: పంచకర్ల రమేశ్‌బాబు

నర్సీపట్నం: చింతకాయల అయ్యన్నపాత్రుడు

అరకు: కిడారి శ్రావణ్‌ కుమార్‌

పాడేరు: గిడ్డి ఈశ్వరి

పాయకరావుపేట: డా. బుడుమూరి బంగారయ్య

విశాఖ ఉత్తరం: గంటా శ్రీనివాసరావు

అనకాపల్లి: పి.గోవింద సత్యనారాయణ

పెండింగ్‌ : భీమిలి, గాజువాక, మాడుగుల, చోడవరం, పెందుర్తి

తూర్పుగోదావరి – మొత్తం : 19, ఖరారు: 16, పెండింగ్‌: 3

కాకినాడ పట్టణం: వనమాడి వెంకటేశ్వరరావు

కాకినాడ గ్రామీణ: పిల్లి అనంతలక్ష్మి

పెద్దాపురం: నిమ్మకాయల చినరాజప్ప

తుని: యనమల కృష్ణుడు

జగ్గంపేట: జ్యోతుల నెహ్రూ

ప్రత్తిపాడు: వరుపుల జోగిరాజు (రాజా)

రాజానగరం: పెందుర్తి వెంకటేశ్‌

రాజమండ్రి రూరల్‌: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

అనపర్తి: నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

మండపేట: వెేగుళ్ల జోగేశ్వరరావు

రామచంద్రాపురం: తోట త్రిమూర్తులు

రాజోలు: గొల్లపల్లి సూర్యారావు

కొత్తపేట: బండారు సత్యానందరావు

ముమ్మడివరం: దాట్ల సుబ్బరాజు

రాజమండ్రి అర్బన్‌: ఆదిరెడ్డి భవాని

పి.గన్నవరం: నేలపూడి స్టాలిన్‌ బాబు

పెండింగ్‌ : అమలాపురం, పిఠాపురం,రంపచోడవరం

పశ్చిమగోదావరి – మొత్తం : 15, ఖరారు : 11, పెండింగ్‌ : 4

ఏలూరు: బడేటి కోట రామారావు (బుజ్జి)

దెందులూరు: చింతమనేని ప్రభాకర్‌

ఆచంట: పితాని సత్యనారాయణ

ఉండి: వేటుకూరి వెంకట శివరామరాజు

తణుకు: ఆరిమిల్లి రాధాకృష్ణ

పాలకొల్లు: నిమ్మల రామానాయుడు

భీమవరం: పులవర్తి రామాంజనేయులు

తాడేపల్లిగూడెం: ఈలి నాని

కొవ్వూరు: వంగలపూడి అనిత

చింతలపూడి: కర్రా రాజారావు

గోపాలపురం: ముప్పిడి వెంకటేశ్వరరావు

పెండింగ్‌ : పోలవరం, నర్సాపురం, నిడదవోలు, ఉంగుటూరు

కృష్ణా – మొత్తం : 16, ఖరారు : 14, పెండింగ్‌ : 2

విజయవాడ తూర్పు: గద్దె రామ్మోహన్‌రావు

విజయవాడ సెంట్రల్‌: బోండాఉమామహేశ్వరరావు

విజయవాడ వెస్ట్‌: షబానా ఖాతూన్‌

జగ్గయ్యపేట: శ్రీరాం తాతయ్య

నందిగామ: తంగిరాల సౌమ్య

మైలవరం: దేవినేని ఉమామహేశ్వరరావు

గన్నవరం: వల్లభనేని వంశీ

పెనమలూరు: బోడె ప్రసాద్‌

అవనిగడ్డ: మండలి బుద్ధప్రసాద్‌

బందరు: కొల్లు రవీంద్ర

గుడివాడ: దేవినేని అవినాష్‌

తిరువూరు: కొత్తపల్లి జవహర్‌

కైకలూరు: జయమంగళ వెంకటరమణ

నూజివీడు: ముద్దరబోయిన వెంకటేశ్వరరావు

పెండింగ్‌ : పామర్రు, పెడన

గుంటూరు – మొత్తం : 17, ఖరారు : 14, పెండింగ్‌ : 3

రేపల్లె: అనగాని సత్యప్రసాద్‌

వేమూరు: నక్కా ఆనంద్‌బాబు

పొన్నూరు: ధూళిపాళ్ల నరేంద్ర

తెనాలి: ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌

చిలకలూరిపేట: ప్రత్తిపాటి పుల్లారావు

గురజాల: యరపతినేని శ్రీనివాస్‌

వినుకొండ: జీవీ ఆంజనేయులు

పెదకూరపాడు: కొమ్మాలపాటి శ్రీధర్‌

సత్తెనపల్లి: కోడెల శివప్రసాదరావు

మంగళగిరి: నారా లోకేశ్‌

తాడికొండ: శ్రీరామ్‌ మాల్యాద్రి

పత్తిపాడు: డొక్కా మాణిక్యవర ప్రసాద్‌

గుంటూరు పశ్చిమ: మద్దాల గిరి

గుంటూరు తూర్పు: మహ్మద్‌ నజీర్‌

పెండింగ్‌: నరసరావుపేట, మాచర్ల, బాపట్ల

ప్రకాశం – మొత్తం : 12, ఖరారు : 10, పెండింగ్‌ : 2

యర్రగొండపాలెం: బూదాల అజితరావు

ఒంగోలు: దామచర్ల జనార్దన్‌

గిద్దలూరు: ముత్తుముల అశోక్‌రెడ్డి

అద్దంకి: గొట్టిపాటి రవికుమార్‌

పర్చూరు: ఏలూరి సాంబశివరావు

సంతనూతలపాడు: బి.విజయ్‌కుమార్‌

కొండెపి: బాల వీరాంజనేయస్వామి

మార్కాపురం: కందుల నారాయణరెడ్డి

కందుకూరు: పోతుల రామారావు

చీరాల: కరణం బలరాం

పెండింగ్‌: దర్శి, కనిగిరి

నెల్లూరు – మొత్తం : 10, ఖరారు : 6, పెండింగ్‌ : 4

నెల్లూరు నగరం: పి.నారాయణ

నెల్లూరు గ్రామీణం: ఆదాల ప్రభాకర్‌రెడ్డి

సర్వేపల్లి: సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

కోవూరు: పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి

ఆత్మకూరు: బొల్లినేని కృష్ణయ్య

గూడూరు: పాశం సునీల్‌

పెండింగ్‌ : కావలి, ఉదయగిరి, సూళ్లూరుపేట, వెంకటగిరి

కడప – మొత్తం : 10, ఖరారు : 7, పెండింగ్‌ : 3

రాజంపేట: బత్యాల చెంగల్రాయుడు

రాయచోటి: రెడ్డప్పగారి పల్లి రమేశ్‌కుమార్‌రెడ్డి

మైదుకూరు: పుట్టా సుధాకర్‌ యాదవ్‌

కమలాపురం: పుత్తా నరసింహారెడ్డి

జమ్మలమడుగు: పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి

పులివెందుల: సింగారెడ్డి వెంకట సతీశ్‌రెడ్డి

బద్వేలు: ఓబులాపురం రాజశేఖర్‌

పెండింగ్‌: ప్రొద్దుటూరు, రైల్వేకోడూరు, కడప

కర్నూలు – మొత్తం : 14, ఖరారు : 9, పెండింగ్‌ : 5

డోన్‌: కేఈ ప్రతాప్‌

పత్తికొండ: కేఈ శ్యామ్‌బాబు

మంత్రాలయం: పి.తిక్కారెడ్డి

ఎమ్మిగనూరు: బీవీ జయనాగేశ్వరరెడ్డి

ఆళ్లగడ్డ: భూమా అఖిలప్రియ

పాణ్యం: గౌరు చరితారెడ్డి

శ్రీశైలం: బుడ్డా రాజశేఖర్‌రెడ్డి

ఆదోని: మీనాక్షి నాయుడు

ఆలూరు: కోట్ల సుజాతమ్మ

పెండింగ్‌ : కర్నూలు అర్బన్‌, నందికొట్కూరు, కోడుమూరు, బనగానపల్లె, నంద్యాల.

అనంతపురం – మొత్తం : 14, ఖరారు : 5, పెండింగ్‌ : 9

హిందూపురం: నందమూరి బాలకృష్ణ

రాప్తాడు: పరిటాల శ్రీరామ్‌

ధర్మవరం: గోనుగుంట్ల సూర్యనారాయణ

పెనుకొండ: బీకే పార్థసారథి

పుట్టపర్తి: పల్లె రఘునాథరెడ్డి

పెండింగ్‌ : గుంతకల్లు మడకశిర, అనంతపురం పట్టణం, తాడిపత్రి, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం, శింగనమల, కదిరి

చిత్తూరు – మొత్తం : 14, ఖరారు : 8, పెండింగ్‌ : 6

పీలేరు: నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి

పుంగనూరు: అనూషరెడ్డి

కుప్పం: నారా చంద్రబాబు నాయుడు

పలమనేరు: ఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డి

చంద్రగిరి: పులపర్తి వెంకట మణిప్రసాద్‌ (నాని)

తిరుపతి: ఎం.సుగుణమ్మ

శ్రీకాళహస్తి: బొజ్జల సుధీర్‌రెడ్డి

నగరి: గాలి భానుప్రకాష్‌

పెండింగ్‌ : మదనపల్లె, పూతలపట్టు, సత్యవేడు, తంబళ్లపల్లి, గంగాధర నెల్లూరు, చిత్తూరు