బిగ్ ట్విస్ట్ : వివేకానందరెడ్డి’ది హత్యా.. ?
వైఎస్ రాజశేఖర్రెడ్డి సోదరుడు, జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి (68) హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున కడప జిల్లా పులివెందులలోని తన స్వగృహంలో ఆయన గుండెపోటుతో కుప్పకూలారు. కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించే లోపే కన్నుమూశారని అందరు అనుకొన్నారు. మీడియాలోనూ ఇవే వార్తలొచ్చాయ్. ఐతే, ఇప్పుడు వివేక మృతిపై బిగ్ ట్విస్ట్ ఏటంటే.. ? ఆయనది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.
వివేకా తలకి, చేతులకి బలమైన గాయాలు ఉన్నట్టు తెలుస్తోంది. గాయాలపై ఆయన బాత్ రూంలో కుప్పకూలి ఉన్నారని పోలీసులు తెలిపారు. వివేకా మృతిపై ఆయన పిఎ కృష్ణారెడ్డి పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. వివేకా మృత దేహానికి పోస్ట్ మార్టమ్ తర్వాత మృతిగల కారణాలు తెలియనున్నాయని చెబుతున్నారు. వివేకా నిజంగానే హత్యకు గురయ్యారా.. ? లేదంటే అలా ప్రచారం చేయడం వెనక రాజకీయం ఏదైనా ఉందా ? అనేది తెలియాల్సివుంది.