‘మహర్షి’ టీజర్ ముహూర్తం ఫిక్స్

వంశీపైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పుడీ సినిమా టీజర్ కి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు సమాచారమ్. ఉగాధి కానుకగా ఏప్రిల్ 6న ‘మహర్షి’ టీజర్ ని విడుదల చేయబోతున్నట్టు తెలిసింది. ఇదే నిజమైతే.. ఉగాధి నుంచి ‘మహర్షి’ హంగామా మొదలైపోయినట్టే.

ఇప్పటికే ‘మహర్షి’ షూటింగ్ దాదాపు పూర్తయింది. రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్నాయి. మరోవైపు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జెడ్ స్వీడుతో జరుగుతున్నాయి. మహర్షి బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ సినిమాల స్టయిల్ లో ఉండబోతుందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో మహేష్ మూడు విభిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నాడు. కాలేజీ స్టూడెంట్, బిజినెస్ మేన్, రైతుగా మహేష్ కనిపిస్తాడట. టీజర్ తో మహర్షి స్టోరీ లైన్ పై ఓ అంచనా రావొచ్చు.