ఆన్ లైన్’లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లీకు !
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో దర్శకుడు సంచలన విషయాలు చూపించబోతున్నట్టు ఆ సినిమా టీజర్, ట్రైలర్స్ తో అర్థమైంది. ఇందులో వర్మ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, నందమూరి కుటుంబాన్ని టార్గెట్ చేసినట్టు కనబడుతోంది. ఈ నేపథ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలని అడ్డుకొనేందుకు టీడీపీ వర్గాలు ట్రై చేస్తున్నారు. వారి ప్రయత్నాలకి ఎన్నికల కోడ్ అమలులోకి రావడం పెద్ద బలంగా మారింది. సినిమా విడుదలని ఆపేయాలంటూ ఎన్నికల కమిషన్స్ ఫిర్యాదులు అందజేస్తున్నారు.
మరోవైపు, ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 22న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని విడుదల చేయాలనే ప్రయత్నాల్లో వర్మ ఉన్నారు. సెన్సార్, సినిమా విడుదల విషయంలోనూ వర్మ న్యాయనిపుణుల సలహాలు తీసుకొంటున్నారు. ఇప్పట్లో సినిమా విడుదల సాధ్యకాకపోతే.. స్వయంగా ఆన్ లైన్ లో లీక్ చేయడానికి వర్మ వెనకాడడు అనే ప్రచారం జరుగుతోంది. అంతకంటే.. ముందే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఆన్ లైన్ లో లీకయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ లీకు వర్మనే చేశాడా.. ? లేక ఇండస్ట్రీ మిగితా సినిమాల్లో లక్ష్మీస్ ఎన్ టీఆర్ లీకై ఉంటుందా.. ?? అన్నది తెలియాల్సి ఉంది.