‘సూర్యకాంతం’ ఎమోషనల్ సాంగ్ విన్నారా.. ?


బి. ప్రణీత్‌ దర్శకత్వంలో నిహారిక – రాహుల్‌ విజయ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సూర్యకాంతం’. ఈ చిత్రానికి నిహారిక సోదరుడు, హీరో వరుణ్‌తేజ్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సందీప్‌ ఎర్రం రెడ్డి, రామ్‌ నరేష్‌, సృజన్ ఎర్రబోలు‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. టీజర్ లో నిహారికని చిలిపిగా చూపించారు. ఇప్పుడీ సినిమా నుంచి ‘పో పోవే.. ‘ లిరికల్ వీడియోని విడుదల చేసింది చిత్రబృందం. కృష్ణకంత్ రాసిన ఈ పాటని కార్తీక్ ఆలపించారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. ఈ పాట అద్భుతంగా ఉంది. యూత్ నోళ్లలో నానేలా కనబడుతోంది. ఈ లిరికల్ సాంగ్ ని మీరు వినేయండీ.. !