వివేకాని చంపింది ఆయన డ్రైవరే.. !
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకేసుపై కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయ్. వివేకాని చంపింది ఆయన డ్రైవర్ అనే రుజువు ఒకటి లభించింది. చనిపోయే ముందు వివేకా రాసిన లేఖని పోలీసులు విడుదల చేశారు. ఇందులో ‘నా డ్రెవర్ నేను తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు. ఈ లేటర్ రాసేకి చాలా కష్టపడ్డాను. డ్రైవర్ ప్రసాద్ ని వదిలిపెట్టొదు. ఇట్లు వివేకానందరెడ్డి’ అని రాసివుంది. ఆ లెటర్ ని మీడియాకు విడుదల చేశారు పోలీసులు. ఐతే, ఈ లెటర్ ని పోలీసులు క్రియేట్ చేశారని జగన్ ఆరోపించారు.
చిన్నాన్న హత్య వెనక కుట్ర ఉందని.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేష్ హస్తం ఉందని జగన్ ఆరోపించారు. హత్యకేసుపై ఏపీ పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదు. ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు జగన్. ఐతే, జగన్ ఆరోపణలపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. వివేకానందరెడ్ది రాసినట్టు పోలీసులు విడుదల చేసిన లేఖ.. జగన్ కుటుంబ సభ్యులే పోలీసులకు ఇచ్చారని తెలిపారు. అంతేకాదు.. వివేకా హత్యపై జగన్ కుటుంబానికి ప్రశ్నల వర్షం కురిపించారు.