రేపు వివేకానందరెడ్డి అంత్యక్రియలు
దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు రేపు (శనివారం) పులివెందులలో జరగనున్నాయి. ఉదయం 11గంటల ప్రాంతంలో అంత్యక్రియలు జరగుతాయని తెలిసింది. పులివెందులలోని రాజారెడ్డి సమాధి పక్కనే వివేకానందరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
మరోవైపు, వివేకా హత్యపై రాజకీయరంగు పులుముకొంది. చిన్నాన్న హత్య వెనక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు, మంత్రి లోకేష్ హస్తం ఉన్నట్టు వైఎస్ జగన్ ఆరోపించారు. మీ ఇంట్లో జరిగిన హత్యని మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. వివేకా హత్య అనంతరం జగన్ కుటుంబ వ్యవహరించిన తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని విషయాలు ఎందుకు దాచినట్టు అంటూ వివేక హత్యపై జగన్ కుటుంబ సభ్యులపై ప్రశ్నల వర్షం కురిపించారు.