వివేకా కుటుంబం చేసింది.. తప్పే !
మాజీ మంత్రి వివేకానందరెడ్డి విషయంలో ఆయన కుటుంబ సభ్యులు వ్యవరించిన తీరు ముమ్మాటికి తప్పే అనే టాక్ వినబడుతోంది. వివేకా హత్యకు గురయ్యారు. ఆయన్ని దారుణంగా నరికి చంపేశారు. నుదిటిపై గొడ్డలితో నరికిన గాట్లు ఫోటోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి మెదడు చితికి బయటికొచ్చేలా ఉన్నాయన్న విషయం అర్థమవుతోంది. ఇలాంటి హత్య.. మొదట గుండెపోటుగా వార్త బయటికొచ్చింది. ఆ తర్వాత కొద్దిగంటలకు వివేకాది హత్యని అనే విషయం బయటికి తెలిసింది. అది కూడా పోస్ట్ మార్టమ్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత స్పష్టత వచ్చింది.
నిజానికి వివేకా మృతదేహాన్ని చూడగానే అది హత్యని చెప్పేయొచ్చు. కానీ, వివేకా కుటుంబ సభ్యులు అలా చేయలేదు. అసలు ఆయనది హత్య అనే విషయం బయటికి చెప్పడానికి ఇష్టపడలేదు. పోలీసులకు కూడా వాళ్లు ఫిర్యాదు చేయలేదు. వివేకా పిఏ నే పోలీసులకి ఫిర్యాదు చేసినట్టు వార్తలొచ్చాయ్. ఆ తర్వాత పెద్ద డ్రామానే నడిచింది. చిన్నాన్న హత్య వెనక ఏపీ సీఎం చంద్రబాబు హస్తం ఉన్నట్టు జగన్ ఆరోపించడం జరిగింది. వైకాపా నేతల ఆరోపణలని సీఎం చంద్రబాబు గట్టిగానే తిప్పికొట్టారు.
వేవికా మృతిపై రాజకీయరంగు పులుముకోవడం పక్కన పెడితే.. ఈ హత్య విషయంలో జగన్ కుటుంబం హుందాగా వ్యవహరించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. వివేకా మృతదేహాన్ని చూసిన ఆయన కుటుంబ సభ్యులు.. వెంటనే ఆయనది హత్యని చెబితే బాగుండేది. జగన్ కూడా చిన్నాని హత్య చేసిన దోషులు పట్టుకోవాలి. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తే సరిపోయేది. పోలీసులు చేస్తున్న దర్యాప్తుకు సహకరిస్తే ఇంకా బాగుండేది. ఇందుకు భిన్నంగా వ్యవహరించిన జగన్ కుటుంబ సభ్యులపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేయడంలో తప్పులేదని కామెంట్స్ వినిపిస్తున్నయ్.