ఆ 7స్థానాలపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్
తెలంగాణ రాష్ట్రంలోని 17ఎంపీ స్థానాలకి గానూ 16స్థానాలని గెలుచుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకొంది తెరాస. అందుకు తగ్గట్టుగానే బలమైన అభ్యర్థులని బరిలోకి దించేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరీ.. ముఖ్యంగా ఏడు స్థానాలపై కేసీఆర్ ఫోకస్ పెట్టినట్టు సమాచారమ్. నల్గొండ, ఖమ్మం, సికింద్రాబాద్, నాగర్‌కర్నూలు, మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబాబాద్ నియోజకవర్గాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ పార్టీ 11 స్థానాల్లో విజయం సాధించింది. నల్గొండ, నాగర్‌కర్నూలు స్థానాల్లో కాంగ్రెస్, మల్కాజిగిరిలో తెదేపా, ఖమ్మంలో వైకాపా, సికింద్రాబాద్‌లో భాజపా గెలిచింది. ఈసారి మాత్రం ఈ స్థానాల్లో గుల్లాభి జెండా ఎగరేయాలనే పట్టుదలతో సీఎం కేసీఆర్ ఉన్నారు. ఇందుకోసం గెలుపు గుర్రాలని బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మల్కాజిగిరి నుంచిరంజిత్రెడ్డిని తెరపైకి తెచ్చారు. ఆయన ఇద్దరు మంత్రులకు సన్నిహితులు.