వన్డే క్రికెట్‌కు డుమిని గుడ్ బై
దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ జీన్‌పాల్ డుమిని వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. త్వరలో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న 2019 ప్రపంచకప్ కు ముందు డుబిని వన్డే క్రికెట్‌కు డుమిని గుడ్ బై చెప్పడం ఆయన అభిమానులకి నిరాశ కలిగించే విషయమనే చెప్పాలి. 2017లోనే డుమిని టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. తాజాగా, వన్డే క్రికెట్ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు.
రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా డుమిని మాట్లాడుతూ.. “నేను కలలు కన్న క్రీడలో రాణించేందుకు శ్రమిస్తూనే ఉన్నాను.. అందుకోసం నాకు మద్దతుగా నిలిచిన జట్టు సభ్యులు, కోచ్, కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని తెలిపాడు. ఇకపై తన కుటుంబం కోసం కాస్త ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
193 వన్డేలాడిన ఈ స్పిన్ ఆల్‌రౌండర్ 37.39 సగటుతో 5,047పరుగులు చేశాడు. 68 వికెట్లు సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా తరఫున 2011, 2015 ప్రపంచకప్ టోర్నీల్లో డుమిని ప్రాతినిధ్యం వహించాడు. ఇక, ఐపీఎల్లో డుమిని ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు.