‘సూపర్‌ డీలెక్స్‌’కు బాలీవుడ్ దర్శకుడు ఫిదా

విజయ్‌ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సూపర్‌ డీలెక్స్‌’. త్యాగరాజన్‌ కుమారరాజా దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్‌ లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తి పాత్రలో, సామ్‌ హంతకురాలిగా , రమ్యకృష్ణ వేశ్య పాత్రలో నటించారు. మార్చి 29న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా ట్రైలర్‌ను చూసి బాలీవుడ్ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ఫిదా అయ్యారు. ఆయన రెండ్రోజుల క్రితమే ట్రైలర్ ని చూశారు. దీనిపై అనురాగ్ ట్విటర్‌ వేదికగా స్పందించారు. తనకి ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని.. దాన్ని మిస్‌ అయినందుకు ఇప్పుడు చాలా బాధగా ఉందన్నారు. “కుమారరాజా తీసిన ‘సూపర్‌ డీలెక్స్‌’ చూశా. మైండ్‌బ్లోయింగ్‌.. సినిమా ఎంతో గొప్పగా ఉంది. ఈ సినిమాలో నేను లేననే బాధ పెరిగిపోతోంది. కుమారరాజా ఎన్నో ట్రిక్స్‌ తెలిసిన, ధైర్యం ఉన్న ఫిల్మ్‌మేకర్‌” అని అనురాగ్‌ ట్విట్ చేశారు.