ఘనంగా విశాల్ నిశ్చితార్థం


కోలీవుడ్ హీరో విశాల్ హైదరాబాద్ అమ్మాయి అనీషాని పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. వీరి నిశ్చితార్థ వేడుక ఇవాళ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు విశాల్‌, అనీశాకు శుభాకాంక్షలు చెప్పారు.

సెప్టెంబరులో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు సమాచారం. అనీశాను ప్రేమిస్తున్నానని విశాల్‌ జనవరిలో ప్రకటించారు. ‘అయోగ్య’ సినిమా చిత్రీకరణ సమయంలో అనీశాతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది విశాల్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె మంచితనం నచ్చి ముందు తనే ప్రపోజ్‌ చేసినట్లు తెలిపారు. ఐతే, విశాల్ నిశ్చితార్థ వేడుకలో తెలుగు స్టార్స్ సందడి కనిపించలేదని సమాచారమ్.