అర్థరాత్రి రష్మి కారు ప్రమాదం.. తీవ్ర గాయాలు ?

యాంకర్ రష్మి గౌతమ్ కారు ప్రమాదానికి గురైనట్టు సమాచారమ్. విశాఖపట్నం జిల్లా గాజువాక కూర్మన్నపాలెం దగ్గర రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని రష్మి కారు ఢీకొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి 11 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషయంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇటీవలే రష్మి కొత్త కారు కొనుక్కున్నారు. ఈ కారులోనే ప్రయాణిస్తున్న రష్మి వ్యక్తిని ఢీకొట్టినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో స్వయంగా రష్మి డ్రైవింగ్ చేస్తుందా.. ? లేదంటే.. డ్రైవర్ ఉన్నాడా.. ?? అన్నది తెలియాల్సి ఉంది.