జగన్ వ్యూహాం మారింది.. !

యుద్ధంలో గెలవాలంటే పక్కా వ్యూహాంతో ముందుకు వెళ్లాలి. అవసరాన్నిబట్టి కొత్త వ్యూహాలని రచించాలి.. అమలు చేయాలి. ఇప్పుడు వైకాపా అధినేత వైఎస్ జగన్ అదే చేస్తున్నట్టు కనబడుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. జగన్ చంద్రబాబుని ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తారు. తీవ్ర విమర్శలు చేస్తారని అందరు భావించారు. ఐతే, అందుకు భిన్నంగా జగన్ ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. ఎక్కడా చంద్రబాబు పేరుని ప్రస్తావించడం లేదు. ఆయనపై విమర్శలు చేయడం లేదు. ఒక్కటే చెబుతున్నాడు.

మేం అధికారంలో వస్తే ప్రజలు ఏం చేస్తాం. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామనే విషయాన్ని మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం నర్సీపట్నంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన చేసిన ప్రసంగాన్ని బట్టి ఆ విషయం అర్థమవుతోంది. వైకాపా అధికారంలోకి వస్తే.. పరిశ్రమల్లోనూ 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేను విన్నాను, నేను విన్నాను అనే యాత్ర సినిమా డైలాగుని వాడుకొని ఆకట్టుకొంటున్నారు.

మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్, జగన్ లు ప్రధాని మోడీతో కలిసి ఏపీ ప్రజలకి మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇన్నాళ్లు తాను చేసిన కూలీకి ఫలితం అడుతున్నానని చెబుతున్నారు. జగన్, చంద్రబాబు.. ల వ్యూహాల్లో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయన్నది మే 23న తేలనుంది.