‘డియర్ కామ్రేడ్’ టీజర్ ట్రెండింగ్’లో టాప్.. !

కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం “డియర్ కామ్రేడ్”. రష్మిక మందన హీరోయిన్. మైత్రి మూవీస్ బ్యానర్ నిర్మిస్తోంది. సౌత్ బాషలన్నింటిలోనూ సినిమా విడుదల కానుంది. ఆదివారం (మార్చి 17) ఈ
సినిమా టీజర్ ను ఐదు బాషల్లో విడుదల చేశారు. అన్ని బాషల్లోనూ టీజర్ కి మంచి స్పందన వస్తోంది.

అంతేకాదు.. విడుదలైన అన్నీ బాషల్లోనూ టీజర్ ట్రెండింగ్ లో నెం.1 స్థానంలో ఉంది. ఈ విషయాన్ని తెలుపుతూ హీరో విజయ్ దేవరకొండ ట్విట్ చేశారు. “ఐదు బాషల్లోనూ డియర్ కామ్రేడ్ టీజర్ ట్రెండింగ్ టాప్ లో ఉంది. దీంతో సెలబ్రేషన్స్ ఐదు రెట్లు అయింది” అని ట్విట్ చేశారు విజయ్. ఈ సందర్భంగా షేర్ చేసిన పోస్టర్ పై టీజర్ 5.5మిలియన్ వ్యూస్ సొంతం చేసుకొంది. 2000పైగా లైకులు వచ్చాయి. ట్రెండింగ్ లో నెం.1లో ఉందని పేర్కొన్నారు.

ఇక, కాలేజీ గొడవలు, ఓ లిప్ లాక్ సీన్ తో డియర్ కామ్రేడ్ టీజర్ ని వదిలారు. కాలేజ్ గొడవల సీన్స్ లో విజయ్ అర్జున్ రెడ్డిని తలపిస్తున్నాడు. ముద్దుల వర్షంలో తడిపేసినట్టుగా లిప్ లాక్ సీన్ ఉంది. మొత్తంగా డియర్ కామ్రేడ్ టీజర్ అదిరిపోయింది. ఈ రేంజ్ లో సినిమా ఉంటే విజయ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడినట్టే.