కర్నూలులో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన 4గురు మృతి !
కర్నూలు జిల్లా నందికొట్కూరులో విషాదం చోటుచేసుకుంది. నందికొట్కూరు పట్టణం బుడగ జంగం కాలనీలో విషాదం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరేసుకొని ఆత్యహత్యకు పాల్పడ్డారు. వీరాంజనేయులు(35) ఆయన భార్య వసంత(32) పిల్లలు రామలక్ష్మి(7), రాజేష్(5)తో కలసి మంగళవారం రాత్రి ఈ దారుణానికి పాల్పడ్డారు.
గ్రామాల్లో వీధి వ్యాపారాలు నిర్వహిస్తూ ఈ కుటుంబం జీవనం సాగిస్తోంది. భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని బంధువులు తెలిపారు. ఇంతలో ఈ దారుణం చోటుచేసుకున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. వీరి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని సీఐ చెప్పారు. నందికొట్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.