‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విజయాన్ని సెలబ్రేట్ చేసుకొంటున్న వర్మ !

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకి లైన్ క్లియర్ అయ్యింది. సెన్సార్ చిక్కులు, న్యాపరమైన చిక్కులు తొలగాయ్. ఎలక్షన్ కమీషన్ కూడా అభ్యంతరాలు చెప్పలేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సెలబ్రేషన్స్ మొదలెట్టాడు. సినిమాలోని ‘విజయం.. విజయం.. శుభ సమయం’ అనే బ్యాక్‌డ్రాప్ లీడ్‌తో సాగే ఈ పాటని విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్-లక్ష్మీ పార్వతీల అన్యోన్య దాంపత్యాన్ని కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. అదేసమయంలో చంద్రబాబు వెన్నుపోటు లుక్కులని చూపాడు.

సినిమా విడుదలకి లైన్ క్లియర్ అయినందుకు వర్మ హ్యాపీ ఉన్నాడు. అప్పుడే సినిమా సగం హిట్ అయిపోయినట్టు ఫీలవుతున్నాడు. ఆ మూడ్ ని సినిమాలోని పాట ద్వారా తెలియజేసినట్టు కనిపిస్తోంది. ఇక, సంచలన విషయాలతో తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్ టీఆర్ సంచలన విజయాన్ని నమోదు చేస్తుందనే నమ్మకంతో వర్మ ఉన్నారు.