పవన్’ని మందలించిన కేటీఆర్
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రసంగం ఆవేశంగా ఉన్నా.. ఆలోచించేలా ఉంటుంది. ఆయన మాటల్లో, చేతల్లో నిజాయితీ కనిపిస్తుంటుంది. అందుకే పవన్ ని యువతరం ప్రతినిధిగా చూస్తున్నారు ఏపీ ప్రజలు. అలాంటి పవన్ తాజా ఎన్నికల ప్రచారంలో నోరు జారారు. ఆయనకు సూటుకానీ కామెంట్స్ చేశారు. ‘తెలంగాణకు వెళ్తే ఆంధ్రా వాళ్లను కొడుతున్నారు’ అన్నారు.
పవన్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పవన్ ని సుతిమెత్తగా మందలించారు. “డియర్ పవన్ కళ్యాణ్ గారూ.. ఇవి మీ ఆలోచనలకు సరికాని వ్యాఖ్యలు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి 29 రాష్ట్రాలకు చెందిన ప్రజలు కలిసి మెలిసి తెలంగాణలో ఉంటున్నారనే విషయం మీకు తెలుసు. మీరు తప్పుగా మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలు అనవసరంగా వ్యతిరేకతను పెంచుతాయి” అని కేటీఆర్ ట్విట్ చేశారు. దీనిపై పవన్ ఏమైనా వివరణ ఇస్తారా.. ?? అన్నది చూడాలి
Dear @PawanKalyan Garu, I hope this was misrepresentation of your thoughts. As you’re aware, Telangana is home to people from 29 states who are living harmoniously since formation of the state
I am sure you agree with me that this sort of rhetoric creates undesirable negativity https://t.co/1ApH2Y64Ov
— KTR (@KTRTRS) March 22, 2019