జనసేనలో చేరిన రామ్ చరణ్ ?


మెగా బ్రదర్ నాగబాబు జనసేనలో చేరారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ కోరిక మేరకు నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ నుంచి జనసేనలోకి మరిన్ని చేరికలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు పార్టీలోకి ఆహ్వానిస్తారన్నదే ఆసక్తిగా మారింది.

మెగాస్టార్ కంటే ముందే మెగా యంగ్ హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి తేజ్, వరుణ్ తేజ్ తదితరులు జనసేన తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అది నిజమే అన్నట్టుగా జనసేన టీ-షర్ట్ ధరించిన చరణ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అది చూసి చరణ్ సీక్రెట్ గా జనసేనలో చేరినట్టు ప్రచారం జరుగుతోంది.

బాబాయ్ ఒక్క ఫోన్ చేస్తే చాలు.. వెళ్లి జనసేన గెలుపుకోసం తమ వంతు సాయం చేస్తామని గతంలోనే రామ్ చరణ్ అన్నారు. ఇప్పుడు ఎన్నికల వేళ పవన్ నుంచి చరణ్ కి పిలుపొచ్చింది. త్వరలోనే జనసేన తరుపున రామ్ చరణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకొంటున్నారు. చరణ్ ఒక్కరేనా బన్నీ, తేజులు కూడా రంగంలోకి దిగుతారా.. !!