ముద్దుల కూతురితో రోహిత్ పాట.. వైరల్ !

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మంచి సింగర్ కూడా. ఐపీఎల్ ప్రారంభానికి ముద్దు రోహిత్ తన ముద్దుల కూతురు సమైరాతో ఆడితూ కనిపించాడు. అంతేకాదు.. కూతురి ఆడిస్తూ ఓ పాట పాడి ఆకట్టుకొన్నాడు. దానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియా లో షేర్ చేశాడు రోహిత్. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోని రైనా రీ-ట్వీట్ చేశాడు.

ఐపీఎస్-12 సీజన్ లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే ఈసారి కూడా ముంభై ఇండియన్స్ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ జట్టుని ముందుండి నడిపిస్తే.. ఈసారి ఆజట్టుకు కప్ ఎగరేసుకోపవడం పెద్ద కష్టమేమీ కాదు. ఈసారి ముంబై జట్టులో యువరాజ్ సింగ్ కూడా ఉండటం ఆ జట్టుకి అదనపు బలమని చెప్పవచ్చు.