‘మహర్షి’ తొలి సాంగ్ ముహూర్తం ఫిక్స్


సూపర్ స్టార్ మహేష్ బాబుని మహర్షి గా చూపించబోతున్నాడు దర్శకుడు వంశీపైడిపల్లి. మహేష్ నటిస్తున్న 25వ చిత్రమిది. ఇందులో మహెష్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కి ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రబృందం. సినిమా లోని మొదటి పాట ని రిలీజ్ చేయడానికి ముహూర్తం పెట్టేశారు. ఈ నెల 29న మహర్షి తొలిసాంగ్ వదలనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ దేవిశ్రీ ప్రసాద్ ట్విట్ చేశారు.

ఇక, మహర్షి టీజర్ ని ఉగాధి కానుకగా ఏప్రిల్ 6న విడుదల చేయబోతున్నట్టు సమాచారమ్. మహర్షి మహేష్ మూడు విభిన్న గెటప్ లో కనిపించబోతున్నాడు. లేజీ స్టూడెంట్, బిజినెస్ మేన్, రైతుగా మహేష్ కనిపిస్తాడట. ఆ మూడు గెటప్ లోకి మహేశ్ మారడానికి కారణలేంటీ అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అల్లరి నరేష్ పాత్ర సినిమాని మలుపుతిప్పేలా ఉంటుందట.