‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు క్లీన్ ‘యూ’
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సెన్సార్ పూర్తయింది. ఈ సినిమా క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ పొందడం విశేషం. అసలు సెన్సార్ జరుగుతుందా.. ? లేదా.. ? అనుమానాల మధ్య ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సెన్సార్ సాఫిగా జరిగింది. ఒకట్రెండు చిన్న కట్స్ తప్పా… అంతా వర్మ అనుకొన్నట్టుగా సెన్సార్ జరిగినట్టు తెలిసింది. అన్నికంటే మించి.. వివాదాస్పద చిత్రంగా ముద్రపడిన లక్ష్మీస్ ఎన్టీఆర్ క్లీన్ ‘యు’ రావడం విశేషం.
ఈ ఆనందంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫైనల్ వార్నింగి ఇచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సెన్సార్ క్లియర్ అయిందని తెలిపుతూ ట్విట్ చేసిన వర్మ.. ఏపీ సీఎంకు ట్యాగ్ చేశాడు. ఎన్నికల కమీషన్ నుంచి కూడా ఈ సినిమాకు లైన్ క్లియర్ అయ్యింది. ఇవాళ నిర్మాత రాకేష్ రెడ్డి ఎన్నికల సంఘం ముందు హాజరై.. సినిమాపై కంటెంట్ పై క్లారిటీ ఇచ్చారు. దీంతో.. ఈ వారం (మార్చి 29) లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమైంది.
Truth Won @ncbn Censor Board Cleared #LakshmisNTR with a UNIVERSALLY VIEWABLE U CERTIFICATE https://t.co/kFQVtr6OpE
— Ram Gopal Varma (@RGVzoomin) March 25, 2019