ఐపీఎల్12 : రాయల్స్ పై కింగ్స్ గెలుపు
ఐపీఎల్12 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. వేసవి రాత్రుల్లో వినోదాన్ని పంచుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ పై పంజాబ్ కింగ్స్ లెవెన్ 14 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట క్రిస్ గేల్ (79; 47 బంతుల్లో 8×4, 4×6), సర్ఫ్రాజ్ ఖాన్ (46 నాటౌట్; 29 బంతుల్లో 6×4, 1×6) మెరుపులతో కింగ్స్ ఎలెవన్.. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
అనంతరం రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 170 పరుగులే చేయగలిగింది. జోస్ బట్లర్ (69; 43 బంతుల్లో 10×4, 2×6) ఛేదనలో మంచి పునాది వేసినా.. రాయల్స్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ముజీబ్ రెహ్మాన్ (2/31), అంకిత్ రాజ్పుత్ (2/33) ఆ జట్టుకు కళ్లెం వేశారు. గేల్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్ :
కేఎల్ రాహుల్ (సి) బట్లర్ (బి) ధవళ్ 4; గేల్ (సి) త్రిపాఠి (బి) స్టోక్స్ 79; మయాంక్ (సి) ధవళ్ (బి) గౌతమ్ 22; సర్ఫ్రాజ్ నాటౌట్ 46; పూరన్ (సి) రహానె (బి) స్టోక్స్ 12; మన్దీప్ నాటౌట్ 5; ఎక్స్ట్రాలు 16 మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 184
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ :
రహానె (బి) అశ్విన్ 27; బట్లర్ రనౌట్ 69; శాంసన్ (సి) అశ్విన్ (బి) కరన్ 30; స్మిత్ (సి) రాహుల్ (బి) కరన్ 20; స్టోక్స్ (సి) నాయర్ (బి) ముజీబ్ 6; త్రిపాఠి (సి) రాహుల్ (బి) ముజీబ్ 1; గౌతమ్ (సి) షమి (బి) రాజ్పుట్ 3; ఆర్చర్ రనౌట్ 2; ఉనద్కత్ (సి) అండ్ (బి) రాజ్పుట్ 1; గోపాల్ నాటౌట్ 1; ధవళ్ నాటౌట్ 5; ఎక్స్ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 170