‘సూర్యకాంతం’ ట్రైలర్ టాక్
సూర్యకాంతం నిహారిక గడుసుది. చిలిపిది కూడా. టీజర్ ని చూస్తే ఇదే అనిపించింది. బి. ప్రణీత్ దర్శకత్వంలో నిహారిక – రాహుల్ విజయ్ జంటగా నటించిన చిత్రం ‘సూర్యకాంతం’. ఈ సినిమా టీజర్ లో నిహారిక చిలిపిగా, గడుసుగా కనిపించింది. దీంతో ఇది కంప్లీట్ నిహారిక సినిమా. సూర్యకాంతంగా నిహారిక వన్ ఉమేన్ షో చేయనుంది అనుకొన్నారంతా. ఐతే, సూర్యకాంతంకి సవితి పోరు కూడా ఉంది. ఈ విషయాన్ని ఇవాళ విడుదలైన ట్రైలర్ లో చూపించారు. ఇదో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అని ట్రైలర్ అర్థమవుతోంది.
హీరో రాహుల్ ప్రేమలో నిహారికతో పాటు మరో అమ్మాయి పడుతుంది. వీరిద్దరిలో నిహారిక టఫ్, మరో అమ్మాయి సాఫ్ట్. వీరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలన్న ప్రశ్న వచ్చినప్పుడు రాహుల్ ఎవరిని సెలక్ట్ చేసుకొన్నాడు ? అనే లైన్ తో సినిమా తెరకెక్కినట్టు ట్రైలర్ తో అర్థమవుతోంది. ఐతే, టీజర్ తో సూర్యకాంతంపై ఏర్పడిన అంచనాలకి ట్రైలర్ గండికొట్టేలా కనబడుతోంది. ఇక, ఈ చిత్రానికి
వరుణ్‌తేజ్ సమర్పకుడిగా వ్యవహరిస్తుండం విశేషం. ఈ వారమే సూర్యకాంతం (మార్చి 29) ప్రేక్షకుల ముందుకు రానుంది.