బ్రేకింగ్ : కర్నాటకలో ఐటీ రైట్స్


కర్ణాటకలో ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. కర్నాటక సీఎం కుమార స్వామి, ఆయన అనుచరులని లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరుగుతున్నట్టు కనబడుతోంది. మొత్తం 12 స్థానాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. సీఎం కుమారస్వామి సోదరుడు రేవణ్న, ఎమ్మెల్సీ బీఎమ్ ఫరూక్, మంత్రి పుత్తారాజు ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. వీరితో పాటు ముగ్గురు కాంట్రాక్టర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల ఆఫీసులు, ఇళ్లలోసోదాలు ఐటీ దాడులు జరుగుతున్నాయి.

ఈ దాడులపై కర్ణాటక సీఎం కుమారస్వామి స్పందించారు. “ప్రధాని నరేంద్ర రియల్ సర్జికల్ స్టయిక్ చేస్తున్నారు. ఐటీ అధికారి బాలకృష్ణ ప్రధానికి సహకరిస్తున్నారు. ఆయనకి రాజ్యాంగబద్దమైన పదవి ఇస్తానని ప్రధాని ఆఫర్ ఇచ్చినట్టున్నాడు. ఎన్నికల వేళ ప్రధాని ప్రభుత్వ సంస్థలని నిర్వీర్యం చేస్తున్నారు” అంటూ కుమారస్వామి ట్విట్ చేశారు. మొత్తానికి.. ఎన్నికల వేళ కర్ణాటకలో ఐటీ రైడ్స్ రాజకీయాలని మరింత హీటెక్కిస్తున్నాయి.