‘మహర్షి’పై నెగటివ్ ప్రచారం
‘మహర్షి’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇది మహేష్ నటిస్తున్న 25వ చిత్రం. ఆయన ఎంతో ఇష్టపడి ఎంచుకొన్న కథ. సినిమా సెట్స్ మీదకు వెళ్లక ముందే ఇది గొప్ప కథ. ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని మహేష్ తెలిపారు. అందుకే ఎంతో ఇష్టపడి ‘మహర్షి’ సినిమా చేస్తున్నాడు మహేష్. షూటింగ్ దాదాపు పూర్తికావొస్తోంది. మే 9న ‘మహర్షి’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలని మొదలు పెట్టబోతోంది చిత్రబృందం.
ఇందులో భాగంగా రేపు (మార్చి 29) మహర్షి తొలిసాంగ్ ని విడుదల చేయనున్నారు. ఇక, ఉగాధి కానుకగా టీజర్ రాబోతుంది. సరిగ్గా సినిమా ప్రమోషన్స్ మొదల్యే ముందు.. సినిమాపై నెగటివ్ ప్రచారం కూడా మొదలైంది. మహర్షి బడ్జెట్ అదుపు తప్పింది. ఏకంగా రూ. 130కోట్లు ఖర్చు చేశారు. దర్శకుడు వంశీపైడిపల్లి తాపీగా చెక్కుడే ఇందుకు కారణమనే ప్రచారం మొదలైంది. దీంతో పాటు సినిమా అనుకొన్నంత బాగా రాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత ? అనేది తెలీదు.
కానీ, ఇలాంటి నెగటివ్ ప్రచారం సినిమాని దెబ్బతీస్తోంది. ఇలాంటి ప్రచారం కొందరు పని గట్టుకొని చేస్తున్నారా.. ? నిజంగానే ముగ్గురు నిర్మాతలు కావడంతో సినిమాపై ఫోకస్ తగ్గిందా.. ? అనేది తెలియాల్సి ఉంది. సినిమా అద్భుతంగా ఉంటే రూ. 150కోట్లు వసూలు చేసే స్టామినా మహేష్ కు ఉంది. అందులో భయపడాల్సిన పనిలేదు. ఎటొచ్చి.. లేని పుకార్లని పుట్టించి మహేష్ సినిమాని దెబ్బకొట్టాలనే ప్రయత్నాలు జరిగితేనే.. ఇబ్బంది. ఇక, ఇవాళ విడుదలైన మహర్షి కొత్త పోస్టర్ అద్భుతంగా ఉంది.