వివేకాని హింసించి చంపారు


మాజీ మంత్రి వివేకానందన హత్యకేసులో షాకింగ్ నిజాలు వెలుగులోని వస్తున్నాయ్. వివేకాని అతి క్రూరంగా హింసించి చంపారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. చంపిన హంతకులెవరో గంగిరెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, ప్రకాశ్‌లకు తెలుసు. హత్య చేసిన వారిని చట్టం నుంచి తప్పించేందుకు వీరు ముగ్గురు ఉద్దేశపూర్వకంగానే నేర ఘటనాస్థలం నుంచి సాక్ష్యాధారాలను తుడిచేసి.. మాయం చేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితుణ్ని గుర్తించేందుకు మరికొన్ని ఆధారాలు సేకరించాల్సి ఉంది. సాక్ష్యాధారాలను ధ్వంసం చేసి.. హత్య చేసిన వారు తప్పించుకొనేందుకు సహకరించిన వీరికి బెయిల్‌ ఇవ్వొద్దు. 15 రోజుల పాటు ముగ్గుర్ని పోలీసు కస్టడీకి ఇవ్వాలని రిమాండు రిపోర్టులో కోరారు.

సాక్ష్యాధారాలు తుడిచేసినందుకు ప్రయత్నించిన తుమ్మలపల్లి గంగిరెడ్డి అలియాస్‌ ఎర్ర గంగిరెడ్డి, ములి వెంకటకృష్ణారెడ్డి, ఎద్దుల ప్రకాశ్‌లపై ఐపీసీ సెక్షన్‌ 201ను కూడా జతపరచి..త్వరలో న్యాయస్థానంలో మెమో దాఖలు చేయనున్నాం. వివేకాది హత్యగా గుర్తించి.. ఐపీసీ సెక్షన్‌ 302 కింద కేసు నమెదు చేశామని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.