ఆర్‌సీబీపై ముంబై గెలుపు

ఐపీఎల్‌లో ముంబయి తొలి విజయాన్ని నమోదు చేసింది. ముంబయి 6 పరుగుల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుని ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబయి 8 వికెట్లకు 187 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌శర్మ (48; 33 బంతుల్లో 8×4, 1×6) హార్దిక్‌ పాండ్య (32; 14 బంతుల్లో 2×4, 3×6) రాణించారు. చాహల్‌ (4/38) బౌలింగ్‌ తో ఆకట్టుకొన్నాడు.

డివిలియర్స్‌ (70 నాటౌట్‌; 41 బంతుల్లో 4×4, 6×6)తో పాటు కోహ్లి (46; 32 బంతుల్లో 6×4) రాణించినా ఛేదనలో బెంగళూరు 5 వికెట్లకు 181 పరుగులే చేయగలిగింది. ఆఖర్లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బుమ్రా (3/20) గొప్పగా బౌలింగ్‌ చేయడంతో బెంగళూరుకు పరాభవం తప్పలేదు. ఐపీఎల్‌ 12లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఇది వరుసగా రెండో ఓటమి.. ముంబయి ఇండియన్స్‌కు తొలి గెలుపు.