హయత్‌నగర్‌లో కారులో మంటలు

హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారు ఇంజిన్‌ నుంచి అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. విప్రోలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసే విజయ్‌ రాహుల్‌ తన కారులో (టీఎస్‌09ఈజడ్‌7989) శుక్రవారం ఉదయం ఔటర్‌ రింగురోడ్డు వైపు వెళ్తున్నాడు. ఉదయం 10:10గంటల సమయంలో కారు హయత్‌నగర్‌ ఆర్టీసీ కాలనీ సమీపంలోకి చేరుకోగానే ఇంజిన్‌ నుంచి అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. వెంటనే కారును రోడ్డు పక్కగా నిలిపిన అతడు కారు లోంచి దిగి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.