దేశం బాగుపడటమే నా టార్గెట్ : కేసీఆర్
అవసరమైతే జాతీయ పార్టీని పెడతానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం మిర్యాలగూడ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ పాల్గొన్నారు. నాది ఎన్నికల టార్గెట్ కాదు. దేశం బాగుపడటమే నా టార్గెట్. ఈ ఎన్నికల తర్వాత అవసరమైతే జాతీయ పార్టీని పెడతానని స్పష్టం చేశారు. దేశానికి బీజేపీ, కాంగ్రెస్ ల పీడ వదలాలె. అప్పుడే దేశం బాగుపడతది అన్నారు కేసీఆర్.
ఈ లోక్ సభ ఎన్నికల్లో తెరాస 16ఎంపీ సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకొన్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగా బలమైన అభ్యర్థులని బరిలోకి దించింది. ఎన్నికల ప్రచారంలోనూ ఓ వైపు సీఎం కేసీఆర్, మరోవైపు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తెలంగాణలో 16ఎంపీ సీట్లని తెరాస గెలిస్తే.. కేంద్రం తలవచ్చి మనకు రావాల్సిన నిధులని తెచ్చుకొందాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొంటామని పిలుపునిస్తున్నారు.
Live: CM Sri KCR speaking in Miryalaguda Public Meeting. #MissionTRS16 #TelanganaWithKCR #VoteForCar https://t.co/8nBh1jXCcN
— TRS Party (@trspartyonline) March 29, 2019